జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి పదేళ్లలో ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ అని ఆయన అన్నారు. ఓటు కోసం వస్తే.. బీజేపీ నేతలను నిలదీయాలని, 15లక్షలు వస్తే బీజేపీకి , రాకపోతే కాంగ్రెస్ కు ఓటయ్యాలన్నారు. రైతు బంధు వచ్చిన వాళ్ళే మాకు ఓటు వేయ్యండని, ఏడాదికి 15000 చొప్పున రైతు భరోసా ఇప్పించే బాధ్యత నాదని ఆయన అన్నారు.
చెట్లకు గుట్టలకు, పుట్టలకు రైతు బంధు ఇవ్వమని ఆయన వ్యాఖ్యానించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీని మోదీ మరిచారని మండిపడ్డారు. రూ.15లక్షలు వచ్చిన వాళ్లు బీజేపీకి, రానివాళ్లు కాంగ్రెస్ ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛను రాదన్నారని. కానీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని చెప్పారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం చెట్లకు, గుట్టలకు రైతు బంధు ఇవ్వదని తెలిపారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.