ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 17 సీజన్ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా.. రేపు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అసలు విషయానికొస్తే.. చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు ఆడుతున్నారు. ఏపీకి చెందిన షేక్ రషీద్, తెలంగాణకు చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం…
నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది.
ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో A13 అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. అతని తో పాటు నరేందర్ అనే ఢిల్లీ కి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ వినీత్. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్ లో విక్రయిస్తున్నారని, హైదరబాద్ లో 15 మంది ఏజెంట్ల సాయంతో…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని.. స్వర్ణపుష్పార్చనలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాల ఆలయ అర్చకులు, అధికారుల అందజేశారు. అంతేకాకుండా.. స్వామి వారి చిత్రపటాన్ని గవర్నర్ కు బహుకరించారు సీఎస్శాంత కుమారి. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట…
వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీనే.. మళ్ళీ వైసీపీకే ప్రజల మద్దతు..! బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడి వైసీపీలో జగన్ సమక్షంలో చేరాను అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాను…
PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది.
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నెయ్యి అనె చందoలాగా ఉన్నాయని, గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి రూ.10,000 పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. తదనంతరం 350 కోట్లకి ఉతర్వూలు జారీచేసి పరిహారం అందించిన పాపాన పోలేదు అదే విధంగా అదే…
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ పేరుతో విడుదల చేశారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వేలాదిగా తరలివచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మే 13 వ తారీకు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావంను మల్కాజిగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని, యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా…
Pakistan: పాకిస్తాన్లో బొగ్గు గని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారు. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిపోయిన బొగ్గు గని నుంచి బుధవారం మరో 10 మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు.
ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆయన పర్యటించారు. గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్…