ఓ క్రికెటర్.. ఓ సినిమా హీరోపై పొగడ్తల జల్లు కురిపించారు. తాజాగా రిలీజైన ఆ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోనప్పటికీ, సినిమాలో మాత్రం హీరో యాక్షన్ చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో చేసిన డ్యాన్స్ వేరే లెవల్ అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. అదేనండీ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా.. పెద్దగా ఆడనప్పటికీ, తొందర్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇకపోతే త్వరలో టీవీలో కూడా ఈ…
వాతావరణ మార్పుల వలన తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అకాల వర్షాలు కురిసాయి. ఈ అకాలవర్షాల వలన రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో పంట నష్టం సంభవించినట్లు తెలుస్తున్నది. వచ్చే రెండు మూడు రోజులు కూడా ఆకాలవర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలియజేయడమైనది. కావున రైతులందరు వచ్చే రెండు మూడు రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మంత్రి వర్యులు కోరడమైనది అదే విధంగా వ్యవసాయ ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు…
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా జట్టు మంచి ఊపు మీదుంది. ఆ తర్వాత.. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్.. ఆగష్ట్ లో షెడ్యూల్ అయింది. అయితే.. ఆ సిరీస్ ను వాయిదా వేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం రాగానే మహిళల క్రికెట్ జట్టుపై అక్కడి ప్రభుత్వం బ్యాన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్లాం మత సంప్రదాయం…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పించగలనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..…
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడూ.. విర్రవీగే మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని, విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు కొప్పుల…
ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. రోజు తినే ఆహారాన్ని 8 గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 91శాతం పెరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఈ నివేదిక విడుదలకు ముందు ఇతర నిపుణులతో ఈ విషయాన్ని ఏహెచ్ఏ బయటపెట్టింది. ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసమని, దేవుడి పూజలో పాల్గొనందున అడపాదడపా ఉపవాసం చేస్తున్నారు. మరోవైపు.. బరువుతగ్గడం కోసం ఇతర రకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు.…
దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.
Supreme Court:కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈసీఐ ఆదేశాలు ప్రకారం 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. హోమ్ ఓటింగ్ కోసం ఫామ్ 'డి' దరఖాస్తులు తీసుకుంటున్నామని పేర్కొ్న్నారు. మరో మూడు…
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం పట్టుకున్నారు. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. కాగా.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…