YSRCP: నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.
నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత నారాయణ మూర్తి ఆరోపించారు. రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేసారు. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. భువనేశ్వరి, పంచుమర్తి అనురాధ, రాంప్రసాదరెడ్డిలపై చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: Dharmana Prasada Rao: ప్రజలు ఇంటెలిజెంట్‌గా వ్యవహరించాలి.. డబ్బు ఇస్తే తీసుకోండి..
టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు మా అనుచరులపై దాడికి దిగారని ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి కిరణ్ తీవ్రంగా మండిపడ్డారు. తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారన్నారు. 20 కార్లల్లో రామాంజనేయులు గూండాలను తెచ్చారని.. తన డ్రైవరుకు, కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. మా మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశారని అన్నారు. తనను హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని.. ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చెయ్యాలని చేస్తోందని చెప్పుకొచ్చారు.