BC Janardhan Reddy: నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు. నంద్యాల జిల్లా రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన బీసీ మాస్టర్ స్కెచ్‌కు గతంలో ఎన్నడూ లేనంతగా ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఎన్నికల కోడ్ రావడంతో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ..వైసీపీకి బలమైన ఓటుబ్యాంకు ఉన్న కొలిమిగుండ్ల., అవుకు, సంజామల మండలాలలో కీలక వైపీపీ నేతలు, కార్యకర్తలు వందలాదిగా ప్రతి నిత్యం సైకిల్ ఎక్కుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టీడీపీలో షురూ అవుతున్న వలసలు ఫ్యాన్ పార్టీ క్యాడరలో గుబులు రేపుతున్నాయి. గత 5 నెలలుగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో బాగంగా బనగానపల్లె నియోజకవర్గంలోని 135 గ్రామాలను రెండుసార్లు చుట్టేసిన బీసీ జనార్థన్ రెడ్డి…ఓవైపు టీడీపీ 6సూపర్ సిక్స్ పథకాలను, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వఫల్యాలను, వైకాపా నేతల అవినీతి, అరాచకాలను, ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. మరోవైపు తనదైన వ్యూహంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అవినీతి, పెత్తందారీ మనస్తత్వం, కాటసాని అనుచరుల దౌర్జన్యాలపై విసుగెత్తిన కీలక వైసీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీలోకి చేర్చుకుంటూ ఫ్యాన్ పార్టీని కోలుకోలేని దెబ్బకొడుతున్నారు.. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డికి బలమైన ఓటు బ్యాంకుగా నిలిచిన కొలిమిగుండ్ల, అవుకు, సంజామల మండలాలపై ఫోకస్ పెట్టిన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి భారీగా వైసీపీ నేతలను, కార్యకర్తలను భారీగా సైకిలెక్కించారు. వరుస చేరికలతో ఆయా మండలాల్లో టీడీపీ మరింత బలోపేతం కాగా…వరుస వలసలతో ఫ్యాన్ పార్టీ బలహీనపడింది.
Read Also: Suicide: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. పోలీసులపై బంధువుల ఆగ్రహం
తాజాగా బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలొ సంజామల మండలం, ఆర్. లింగందిన్నె గ్రామానికి చెందిన వైసీపీ కి చెందిన ఉప సర్పంచ్ లత భర్త అన్నెం పరమేశ్వర్ రెడ్డి, అన్నెం వెంకటసుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో వార్డ్ మెంబెర్స్ యాకుబ్, రాజశేఖర్, లక్ష్మి మరియు వైసీపీ నాయకులు సూలం గురవయ్య, మూరబోయిన వెంకటేశ్వర్లు, మాదిగ సుబ్బా రాయుడు, మాదిగ చిన్న ఓబన్న, మాదిగ నాగేష్, కుంటి ఓబులేసు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి కుటుంబాలతో సహా 80 కుటుంబాలు వైసీపీని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు కంచుకోట అయిన కొలిమిగుండ్లలో ఈసారి కాటసాని రామిరెడ్డికి భారీ దెబ్బ కొట్టారు. టీడీపీ సీనియర్ నేత వి పక్కిరా రెడ్డి ఆధ్వర్యంలో నాగేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, తిరుమల రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి, వంటి వైసీపీ నేతలతో సహా తదితర 45 కుటుంబాలు బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత ఎక్కడా జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని తుంగలోకి తొక్కిందని ఆరోపించారు. వేల మంది నిరుద్యోగులు అభివృద్ధి లేక, పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక యువత నిరుద్యోగులు గా మిగిలిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 50 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మరియు గౌరవం కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టమని పార్టీలో చేరిన వైసీపీ నాయకులు అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా బనగానపల్లె నియోజకవర్గంలో 1800 కోట్లతో అభివృద్ధి పరిచారు.. కానీ కొన్ని మాయ మాటలు నమ్మి 2019లో కాటసానిని గెలిపించామన్నారు. ఈ సారి తప్పకుండా బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించారు. మొత్తంగా వైసీపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న కొలిమిగుండ్ల, అవుకు, సంజామల మండలాల్లో కీలక వైసీపీ నేతలు, కార్యకర్తలు బీసీ జనార్థన్ రెడ్డికి సై అంటూ సైకిలెక్కుతుండడంతో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈసారి ఓటమి తప్పలే లేదని బనగానపల్లె ప్రజలు అంటున్నారు.