కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు తల దించుకునేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఈటల గెలవడానికి బీజేపీ బీఅర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈటల గెలవడానికి మల్కాజ్‌గిరిలో బీఅర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల గెలుపు కోసం…
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీజీడీసీఏ) మార్చి 15 మరియు 20 మధ్య హైదరాబాద్‌లోని ఆరు వేర్వేరు హోల్‌సేల్ వ్యాపారులపై దాడులు నిర్వహించింది. న్యూఢిల్లీలోని డ్రగ్ హోల్‌సేల్ వ్యాపారుల నుండి కొనుగోలు చేయకుండా అక్రమంగా కొనుగోలు చేసిన ‘ఇన్సులిన్’ ఇంజెక్షన్లను (ప్రీ-ఫిల్డ్ పెన్లు) గుర్తించింది. ఇన్సులిన్ ఇంజెక్షన్లను టోకు వ్యాపారులు 40 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో విక్రయిస్తున్నారు మరియు సరఫరా గొలుసు (లేదా) నకిలీ ఔషధాల నుండి అక్రమంగా మళ్లించబడతారని అనుమానిస్తున్నారు, తద్వారా వాటి ప్రామాణికతపై…
తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు పెద్దఎత్తున ధ్వంసమైన నేపథ్యంలో రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల నేపథ్యంలో.. కరువు, వడగళ్ల వానలు వచ్చిన రైతుల పట్ల ముఖ్యమంత్రికి సానుభూతి లేకపోవడాన్ని రామారావు ప్రశ్నించారు. ఏఐసీసీ నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీ పర్యటనల కంటే రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రంలో రాజకీయంగా పుంజుకునే వ్యూహాలకు ప్రాధాన్యత…
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమన్నారు. రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు ను నిర్ణయించేది యువత… అ యువతకు ఉద్యొగు, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 2014లో సంవత్సరానికి 2…
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.
చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రయాణికుల బస్సు సొరంగం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా నార్డిక్ దేశాలు (ఉత్తర ఐరోపా, అట్లాంటిక్ దేశాలు) అత్యధిక స్కోర్లతో సంతోషకరమైన దేశాలలో ఉన్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి, ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాలచర్ల గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న బండి శ్రీవల్లి(4) అనే చిన్నారి మృతి చెందింది.