ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు.
ఢిల్లీ మెట్రో రైలులో ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోలు తీసి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియోల్లో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అందులో డ్యాన్స్ చేసేవి, కొట్టుకునేవి, పాటలు పాడేవి ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.…
సోషల్ మీడియా ప్రాముఖ్యత .. ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మే 13 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని మరింత విస్తృతం చేయడానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున కనెక్ట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇంటర్నెట్లో మహిళలు, యువత మరియు నవయుగ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో, రాష్ట్రంలోని బిజెపి సోషల్ మీడియా వార్ రూమ్ రాష్ట్రంలోని ఓటర్లను చేరుకోవడానికి వివిధ సోషల్ మీడియా…
గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కదిలితే ప్రభుత్వాలు మారతాయని.. అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయని అన్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఈ యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఘటన గురించి జోషి కుటుంబానికి భారతీయ రాయబార కార్యాలయం సమాచారం అందించింది. ఘటనపై న్యూయార్క్‌లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తుపల్లి కాదు ఇది సత్తాపల్లి అని కొనియాడారన్నారు. సత్తుపల్లికి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫీల్ అవుతున్నానని, సత్తుపల్లి తెలుగుదేశం ప్రజలు తలుచుకుంటే ఎక్కడైనా గద్దె ఎక్కోచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కార్యకర్తలకంటే మన తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ పని చేశారని, నేను…
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో వైన్ షాపులు క్లోజ్ అవనున్నాయి. అంతేకాకుండా.. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని మద్యం దుకాణాలు మూయాలని సూచించారు. మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ…
విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందని నేపథ్యంలో మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమను రెండు రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిందే.. అంతా సజావుగా ఉంది అనుకునే సమయంలో కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కొన్ని రోజులుగా నిలిపివేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలు వస్తున్నారు…మోడీ ప్రధాని కావాలని అంటున్నారు…కేంద్ర పథకాల తో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ కే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం…