ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 33 బంతులు ఆడిన సంజూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా.. వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు.
నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.. ఆ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల కానుంది.
బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్ మాదిగ మాట్లాడుతూ తాను బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక బీజేపీ కి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాదిగ వర్గాలకు మేలు…
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముందుగా రాజస్థాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు..! మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాజాతర ముగిసిపోయి నెల గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ గొర్రెల బలి, బంగార(బెల్లం) లతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మునుగు జిల్లాలో రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల దర్శనానికి భక్తులు…
ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు.