లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.
మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తాను టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించలేదని పేర్కొన్నారు. కొండపల్లిలో మాత్రం అనుకోకుండా ఒకసారి అలా జరిగిన మాట వాస్తవమే.. అందులోనూ తన…
ఈసారి హోలీ పండుగను మార్చి 25న జరుపుకుంటున్నారు. సహజంగానే, పిల్లల ఆనందం లేకుండా ఏ పండుగ అయినా అసంపూర్ణంగా ఉంటుంది. హోలీ అంటేనే రంగుల పండగ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా చేసుకునే పండగ హోలీ. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా అందరూ పండుగ చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ (IT)లో ఉద్యోగం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది యువత ఇందులో పని చేయాలని కలలు కంటూంటారు. అయితే.. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలో పని చేయాలనుకునే వారు.. ఈ రెండు ఏజెన్సీల గురించి తెలుసుకోవాలి. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అనేవి రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు. ఇవి.. ఆర్థిక అమలు, పన్నుల రంగంలో ఇవి విభిన్న పాత్రలు మరియు బాధ్యతలను కలిగి ఉంటాయి. ఈడీ,…
ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు.. గ్రామాల్లో ముసలి వాళ్ళు సైతం మోడీ కే ఓటు అంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ కి ఓటు వేసుకున్న ఈ ఎన్నికల్లో మోడీ కే వేస్తామని అంటున్నారని, తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. 6 గ్యారంటీ లు అమలు కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపొందింది. 20 పరుగుల తేడాతో లక్నోపై రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచిన రాజస్థాన్.. 173 పరుగులకే కట్టడి చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ ఎఫ్ఐఆర్తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో.. కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఈసారి ముంబై జట్టు కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యాతో బరిలోకి దిగుతుంది.
హైదరాబాద్కి చెందిన యువతికి భారీ మోసం బారిన పడింది. యువతిని నమ్మంచి రూ.2 కోట్ల 72 లక్షలు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. షాదీ డాట్ కాం సైట్ లో యువతి పరిచయమైన నిందితుడు.. గ్లెన్ మార్క్ ఫార్మా కంపెనీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన పేరు రిషి కుమార్గా యువతికి పరిచయం చేసుకున్నాడు. యువతికి రిషి కుమార్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.. అందుకు యువతి సైతం ఒప్పుకుంది. అయితే.. తాను కంపెనీ పనిమీద అమెరికా వెళ్తున్నానని..…