కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా... శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఉంటాయని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని ఇతర పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలను సైతం కలుపుకొని పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ కు చెందిన మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో కెపిహెచ్బి డివిజన్ కి చెందిన గంగా శివకుమారి ప్రధాన…
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠపోరులో కోల్ కతా గెలుపొందింది. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో క్లాసెన్ కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్ లో సన్ రైజర్స్ గెలుస్తుందని అనుకుంటే.. హర్షిత్ రాణా వేసిన బౌలింగ్ లో కీలక క్లాసెన్ (63) వికెట్ తీశాడు. అంతకుముందు షాబాజ్ అహ్మద్ ను ఔట్ చేశాడు. చివరి బంతికి…
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ లో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురు నేతలు మాట్లాడుతూ.. యార్లగడ్డ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తామని తెలిపారు.
లోకల్ గా ఇసుక కొరత ఉండొద్దన.. గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోవద్దని.. స్థానిక అవసరాలకు ఉచిత అనుమతి ఇస్తూ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్.. మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ముందు ఓ భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్ కతా బ్యాటింగ్ లో ముందుగా ఓపెనర్లు.. ఫిలిప్ సాల్ట్ (54) పరుగులతో…
అధిక ఇంధన ధరలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రెండేళ్ల సూచన వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పూరీ మాట్లాడారు.
కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు…