ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ…
తాను చేరలేనంత దూరం కాదు… దొరకనంత దుర్గం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని శనివారం వివిధ కులసంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే 317 జీవో బాధిత ఉద్యోగులు కూడా కలిశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కలిశారు. జీవో 317 వల్ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నికలు ముగియగానే జీవో…
ఈ కాలంలో చాలా మంది యువతీ యువకులు పోర్నోగ్రఫీ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. వాటిని చూడనిదే రోజు గడవని స్థితికి చేరుకుంటున్నారు. మరి ఇలాంటి సెక్స్ వీడియోలు చూడటం వల్ల వారి మీద పడే చెడు ప్రభావం ఏమిటి? ఈ పోర్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్‌లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. అలా అయితే బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మెదక్ సీటును ఆ పార్టీ ఇతర ప్రాంతాల వారికి అమ్ముకున్నదని ఆరోపించారు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ…
బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య భూమిని విక్రయించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) మంజూరును తాత్కాలికంగా నిలిపివేసింది
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. మరికాసేపట్లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.
ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ సమావేశం కానుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్దులు. ఖరారు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. ఏపీలో స్థానాలు, అభ్యర్ధుల ఖరారు పై సుదీర్ఘంగా బీజేపీ నేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి.
పాకిస్థాన్ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు