నగరంలోని సెల్‌ఫోన్ టవర్లపై పరికరాలను చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ మీడియా తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ చేస్తున్నారని, ఈ పరికరాలు మొబైల్ టవర్స్ లో వాడతారు.. మొబైల్ సిగ్నల్స్ అందడానికి ఈ పరికరాలు అత్యవసరమని ఆమె తెలిపారు. అయితే.. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, కాచిగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నిందితుల నుంచి 60 నుండి 70 లక్షల విలువ చేసే పరికరాలు స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు.
అంతేకాకుండా..’రెగ్యులర్‌గా టవర్ల కు సంబంధించిన పరికరాలు చోరీ అవుతున్నాయని ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టాం… టవర్ల పరికరాలను ఇన్స్టాల్ చేసే వారే ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించాము.. సాధారణ వ్యక్తులు టవర్లకు ఈ పరికరాలను సెట్ చేయలేరు.. అలాగే రిమూవ్ చేయలేరు. ఇన్స్టాల్ చేయడానికి నాలెడ్జ్ ఉన్నవారే ఈ చోరీలకు పాల్పడ్డారు.. టవర్లలో ఈ పరికరాలను పిలుస్తాం చేయడానికి అనుభవం ఉన్న వారిని సెల్యులార్ కంపెనీలు హైర్ చేసుకుంటాయి.. ఇలా సెల్యూలర్ కంపెనీలో నిందితులు తొమ్మిది మంది పనిచేస్తున్నారు. టవర్లకు పరికరాలు ఇన్స్టాల్ చేసిన మరుసటి రోజు వేరే వచ్చి ఆ పరికరాలను దొంగిలిస్తారు. టవర్లకు చెందిన పరికరాలు చోరీ చేయడంలో నాగరాజు, నగేష్ ప్రధాన నిందితులు కాక మరో ఐదుగురు రిసీవర్లు ఉన్నారు..
ఇలా చోరీ చేసిన ఈ పరికరాలను ఢిల్లీలోని రిసీవర్లకు పంపుతారు. ఢిల్లీలో 500 రిసీవర్లు ఉన్నారు… చోరీ చేసిన సెల్యూలర్ కంపెనీ పరికరాలు దేశంలో వాడితే ఆయా సెల్లులార్ కంపెనీలు ఐడెంటిఫై చేస్తారు.. దీంతో చోరీ చేసిన పరికరాలను విదేశాలకు వివిధ మార్గాల్లో పంపుతున్నారు. చోరీ చేసిన పరికరాలను ఒక్కొక్కటి మూడు లక్షల వరకు విక్రయిస్తున్నారు. నిందితులు చాలాకాలంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారు.. జియో టవర్లకు చెందిన పరికరాలను చైతన్య, రవి నాయక్ అనే వ్యక్తులు చోరీ చేశారు..’ అని డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు.