జగిత్యాల పట్టణం పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తానన్నారు. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం.. మంచంలో పడుకొనైనా ప్రజలకు అండగా నిలుస్తానన్నారు. బలహీన వర్గాలకు కేటాయించిన హక్కులు వారికే చెందేలాగా వారి హక్కులను కాపాడానని సంతృప్తి మిగిలిందని, నా ప్రతి విజయంలో జగిత్యాల ప్రజలు వెంట ఉన్నారని, యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో అవకాశం ఇవ్వండి, ప్రజల తరుపున కొట్లాడుతానన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే మరింత మెరుగైన సేవలందిస్తానని, అవకాశం వచ్చిన ప్రతిసారి జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని ఆయన అన్నారు. జగిత్యాల పట్టణ యావర్ రోడ్ విస్తరణకు 100 కోట్లు కేటాయించాయిన విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలకు మోడీ పాలనే కారణమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నేను ఎమ్మెల్యే గా గెలవలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగిత్యాల ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి ఒక వారధిగా కృషి చేస్తున్నానన్నారు.