హోలీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసమని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు.…
కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు.
Holi in Nizamabad: ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సాలో పిడిగుద్దుల ఆటను నిర్వహిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.
పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్థిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం వరించింది. చివరలో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఉమేష్…
బీజేపీ అధిష్ఠానం లోక్సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ నుంచి బీజేపీ కీలక నేతను అభ్యర్థిగా ప్రకటించింది.
రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి పండుగను రాష్ట్ర ప్రజలు సోమవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త…
జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్లో పెట్టింది.
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు.