ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా? 3 ఏళ్లుగా రూ.7 వేల 800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలా? విద్యార్థులను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వ్రుత్తి విద్యా కళాశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఫీజు రీయంబర్స్ మెంట్ట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న…
పాకిస్తాన్ టీ20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా.. తన కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ.. ఆయన వైదొలుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీసీబీ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజమ్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్…
పరిమితికి మించి ప్రయాణం.. మితిమీరిన వేగం.. ప్రమాదానికి కారణమైంది. పొలానికి వెళ్లి తిరిగివస్తున్న కూలీలను గాయాల పాలు చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో టైరు పగిలి కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో కోల్ కతా గెలుపొందింది. 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు హోంగ్రౌండ్ లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. కానీ.. ఈరోజు కేకేఆర్ తో చేతిలో ఓటమి చెందింది.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా అని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీకే అరుణ ఆధ్వర్యం లో వెయ్యి మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా భారత దేశాన్ని ఉంచిన ఘనత ప్రధాని మోడీ ది అని,…
శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు దృష్టి సారించారు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కలిసిపోయారు. బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నారు. దీంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో,…
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో కే.కేశవరావు, కడియం శ్రీహరిలు అనేక పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీని వీడడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన అన్నారు. కే.…