Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alias Rukmini: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, నితిన్ హీరోగా రూపొందుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. సినిమా ప్రకటనతోనే క్యూరియాసిటీ పెంచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ రోజు నుంచి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవలే 2026 ఆగస్టు 3న హైదరాబాద్‌లోనే అత్యంత ఘనంగా నిర్వహించారు. కథా నేపథ్యం ప్రకారం, సినిమాలోని అత్యధిక భాగాన్ని ఇండోర్ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలలో ప్రత్యేకమైన సెట్స్ వేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
నాని సమర్పణలో, దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్ వచ్చాక మాత్రమే ఆమె పాత్ర గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాకి ‘బేబి’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన పాటలు, అవుట్డోర్ సన్నివేశాల షూటింగ్ కోసం మాత్రమే చిత్ర యూనిట్ ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- SS Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కంటే 5-6 రెట్లు ఎక్కువ.. 'వారణాసి'పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. 'వారణాసి' తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
ఇక ఈ ప్రాజెక్ట్‌పై నాని కూడా ప్రత్యేక నమ్మకం పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ బలంగా ఉండటంతోనే ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చారని సమాచారం. నాని, నితిన్ కాంబో పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాని నిర్మాతగా కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో, నితిన్‌తో ఆయన చేస్తున్న ఈ సినిమా టాలీవుడ్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. షూటింగ్ ప్రారంభంతో ‘అలియాస్ రుక్మిణి’ ప్రచారం కూడా కొత్త దశలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను 2027 ప్రథమార్ధంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
- Tags
- Alias Rukmini
- cinema
తాజావార్తలు
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-
BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!