ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు.
సిటిజన్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ, బీజేపీల బినామీ చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు టీడీపీ హయాంలో పదవి అనుభవించారన్నారు. నిమ్మగడ్డ రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక…
రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో ‘రైతు దీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా…
Sheikh Hasina: మాల్దీవుల దారిలోనే ‘‘ఇండియా ఔట్’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ ఉద్యమాన్ని లేవనెత్తింది. భారతదేశానికి మిత్రురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనాపై ద్వేషంతో అక్కడ మతఛాందసవాద బీఎన్పీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్ టేకర్‌గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. దీంతో.. మహమ్మద్ షమీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసి ఈ రికార్డు సాధించాడు.
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ…
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు.
ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే అతని స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేయాలన్న గుజరాత్ మేనెజ్మెంట్కు.. అతనొక వజ్రాయుధంలా దొరికాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అంతగా రాణించలేకపోతున్నాడు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలుపొందింది. అదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో కూడా గెలువాలనే కసితో ఉంది. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని కోరుకుంటుంది.