అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దులపై చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ.. వాటికి పేర్లను మారుస్తున్నట్లు వెల్లడించింది.
పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితమే ఏర్పడింది. షాబాజ్ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఏప్రిల్ 1) నుంచి గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.
జ్ఞాన్వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్ జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ సవాలు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై గెలిచింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీకి తొలి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో అటు చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓటమి నమోదైంది.
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని, రాష్ట్రంలో ఏనాడైనా పంటల బీమా డబ్బులు కానీ, కరువు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా ఏనాడైనా కేసీఆర్ రైతుల వద్దకు పోయారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంపొయాక ఇప్పుడు…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషబ్ పంత్ (51) పరుగులతో రాణించారు.
ప్రకృతి వైపరీత్యాలని, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలనీ ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి గల ప్రతిపక్ష నాయకులారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, 2023. అంటే వర్షాకాలం అయిపోయిన తరువాత. అప్పటికే నాగార్జునసాగర్ లో నీళ్లు లేని కారణంగా మొదటిపంటకే నీళ్ళివనీ మీరు, రెండో పంటకి నీళ్ళివాలని హేతుబద్దత లేని డిమాండులు చేయడం మీ దుర్భుద్దికి…