గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు బీజేపీ అమలు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనం నోట్ల రద్దీతో వైట్ మనీ గా మారిపోయిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కు చట్ట బద్ధత కల్పించాలన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేశారని, క్రూడాయిల్ దరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వాన్ని బీజేపీ వ్యాపార సంస్థగా మర్చివేసిందని, నేడు దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంక్షోభానికి బీజేపీ బీఆర్ఎస్ లే కారణమన్నారు జీవన్ రెడ్డి. పసుపు బోర్డు విధి విధానాలపై స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా సరిగ్గా పని చేయలేదని, కనీసం ప్రతిపక్ష నేతగానైనా బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కొప్పుల పదేండ్లలో ఏనాడైనా ధర్మపురి నియోజకవర్గ సమస్యల కోసం కేసీఆర్ దగ్గరికి వెళ్లాడా అని ప్రశ్నించారు. తర్వాత అడ్లూరి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ లీడర్లు ఆయనను సత్కరించి విషెష్ చెప్పారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, నాగభూషణం, నందయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.