తిరుమల ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు.
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని, ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్న పది సంవత్సరాలపాటు రైతుల ను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారని…
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇస్లాంగర్ పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు చెల్లాచెదురైంది. ప్రమాదం జరిగిన బాణసంచా గోదాము బిల్సీ రోడ్డులో ఉంది. అయితే.. ఈ ప్రమాదంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అందరు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చేశారో మీ విజ్ఞత కే వదిలేస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు బయట పెట్టగానే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత brs ఉండదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి ముందు చూసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. 50 సీట్లు కూడా దాటవని సర్వేలు చెబుతున్నాయని,…
పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాయిల్డ్ రైస్ కొనాలని మోడీని కోరితే ఓకే చెప్పారన్నారు కిషన్ రెడ్డి.…
డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు.