Yennam Srinivas Reddy : కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్‌ను తలపిస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. ఆ దర్బార్ మాటలు వినివిని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని ఆయన విమర్శించారు. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్ పెంచి పోషించారని, ఆ సైన్యంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. ఆ సైన్యమే ఒక్కొక్కటి బయట పెడుతున్నా. కేటీఆర్ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం సిగ్గు పడుతోందన్నారు. లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెబుతున్నాడని, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? అని ఆయన ఆయన అన్నారు.
అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమకంటే ముందు మీ ఆస్తులు ఎన్ని ప్రస్తుత ఆస్తులు ఎన్ని? కేటీఆర్ లీగల్ గా ఫైట్ చేద్దామా? అమెరికా నుండి ఇండియకొచ్చినప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎన్ని..? సవాల్ ను స్వీకరిస్తావా? చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.. టెలిగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేయడం దేశ ద్రోహమని, మీ ప్రవర్తనల వల్ల రాష్ట్ర పరువు పోయిందన్నారు. కేటీఆర్ మీకు పరువుందా? పరువు నష్ట దావా వేసే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!