మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. నవ్వితే నాలుగేళ్లు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ ప్రగతి భవన్లో, ఫాంహౌస్‌లో పడుకున్నారని.. తమ ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజల కోసమే పని చేస్తోందన్నారు.
షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది.
ప్రముఖ కళాకారుడు కిన్నెర మొగిలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిపై ఓ పాట కూడా పాడారు. "పాలమూరు పులిబిడ్డ" అంటూ పాడిన పాటను విని రేవంత్ ఆనందించారు.
రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు మారడం ఆనవాయితీ అని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు.
బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సమిష్టిగా కృషిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలోని కళ్యాణ మండపం నందు సీతారాంపురం ఉదయగిరి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశంతో పాటు పరిచయ కార్యక్రమాన్ని ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, సీతారాంపురం మండల కన్వీనర్ ప్రభాకర్ రాజులు నిర్వహించారు.
దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది.
విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.