Kakarla Suresh: ఏపీలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచార జోరు కొనసాగుతోంది. సీతారాంపురంలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. జన సందోహం నడుమ సీతారాంపురం పట్టణంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం చేశారు. సీతారాంపురం శివాలయంలోఉదయగిరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాంపురం బస్టాండ్ నుంచి పట్టణంలోని ప్రధాన రహదారులు అభిమానులతో నిండాయి. ఉదయగిరి ముద్దుబిడ్డ కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేశారు.
Read Also: Mallikarjun Kharge: భయపడే నేత దేశానికి మంచి చేయలేరు: మల్లికార్జున ఖర్గే
సీతారాంపురం పట్టణ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 40 సంవత్సరాలుగా ఏమి చేశారు ఇంకేం ఉద్ధరిస్తారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి వల్ల ఏమీ ఓరగదు, అధికారాన్ని వృథా చేశారని కాకర్ల సురేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా చంద్రబాబు ప్రభుత్వం రావాలని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు సంవత్సరాలుగా సొంత నిధులతో ఎంతో మందిని ఆదుకున్నానని కాకర్ల సురేష్ తెలిపారు. ఉదయగిరికి పరిశ్రమలు తీసుకొస్తా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, రైతులకు వెన్నుదండుగా నిలుస్తానని కాకర్ల సురేష్ భరోసా ఇచ్చారు. ఒకేరోజు నాలుగు పంచాయతీల్లో కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు.