గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా లాభ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం…
ఉత్తరప్రదేశ్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన.. ఇద్దరు పాకిస్థానీలు సహా ముగ్గురు ఉగ్రవాదులను యూపీ ఎస్టీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ(ISI) సాయంతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు ప్లాన్ చేశారు. STSF ప్రకారం.. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI సహాయంతో కొంతమంది పాకిస్తాన్ పౌరులు నేపాల్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించబోతున్నట్లు కొంతకాలం నుంచి మాట్లాడుతున్నారు. వీరంతా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని, ఐఎస్ఐ సాయంతో హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరంలో శిక్షణ కూడా…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీల నియామకం జరిగింది. ఇటీవల కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, 6గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌తో ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి రెండు సూచీలు వేగంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య.. సెన్సెక్స్ 74,501 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 80.00 పాయింట్ల లాభంతో 22,514.70 పాయింట్లకు చేరుకుంది.
10 సంవత్సరాలు BRS అధికార దుర్వినియోగం తోకక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. కనీసం సిగ్గు లేకుండా రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఎజెండా పెట్టుకుంది… పిరాయింపులకి ప్రోత్సహిస్తుందన్నారు. కుక్కలను నక్కలని కేసీఆర్ ఎందుకు టికెట్ లు ఇచ్చారో చెప్పాలన్నారు కిషన్…
వాట్సాప్ లో వీడియోల కోసం అదిరిపోయే ఫీచర్ రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోని రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్ లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో యాప్ లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్ కి మారినప్పుడు కూడా ఈ మోడ్ లో వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్ఠానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు.
కేటీఆర్.. లీగల్ నోటీసులు పంపారని, కేటీఆర్.. నీకు లా.. అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉందా..? అని అన్నారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ అధికారుల అరెస్ట్ లు జరుగుతున్నాయని, తెలంగాణ వ్యాప్తంగా వార్ రూమ్ లు పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు అని అరెస్ట్ చేస్తున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబంకి.. పెయిడ్ జర్నలిజం మాత్రమే తెలుసు అని ఆయన విమర్శించారు. . నా ఫోన్ ట్యాప్ చేశారు.. దీని వెనకాల బాద్యులు ఎవరని…