అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ నేతల మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నారు.
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (నందికొండ)లో వానరాలు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు జగదీష్ రెడ్డి. నాగార్జునసాగర్ ను మున్సిపాలిటీగా చేసి, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని, 2014కు ముందు ఉన్న…
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు.
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీసులో బుధవారం దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సమీక్ష నిర్వహించారు.
Mango production: ఈ ఏడాది దేశంలో మామిడి ఉత్పత్తి పెరుగుతుందని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ టీ దామోదరన్ తెలిపారు. మామిడి ఉత్పత్తి 14 శాతం పెరిగి 24 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు.
50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్, లక్ష రూపాయలు పెళ్ళికానుక, పది లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.