కడియం శ్రీహరి ఎమ్మార్పీఎస్ మీద, తమ మీద వ్యక్తిగత విమర్శలు చేశారని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. తన స్వార్థాన్ని, తన అవకాశవాదాన్ని కప్పి పుచ్చుకోవడానికి మా మీద నిందరోపణ చేసే ప్రయత్నం చేశాడన్నారు. తన బిడ్డ భవిష్యత్ కోసమే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో చివరలో లామ్రోర్ 13 బంతుల్లో 33 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), డుప్లెసిస్ (19) పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషియాన్ ఫుడ్ ఫర్ జోన్ ప్లేయర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ హాజరయ్యారు.
గత ఆర్థిక సంవత్సరం కంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖలో ఆదాయం తగ్గింది. 2023-24 సంవత్సరంలో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా శాఖ రూ.197 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించగా, అంతకుముందు సంవత్సరంలో రూ.227 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీంతో ఏడాదిలో రూ.30 కోట్లకు పైగా తగ్గుదల ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం (జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం), వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి మరియు కల్లూరులో మరియు…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కి అందరూ ఓటేయాలని కొందరు ప్రజల ముందుకు వస్తున్నారు.. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ప్రజలు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఇచ్చారా.. సెంటు జాగా ఇచ్చారా.? ఓటెందుకు వేయాలన్నారు. నిన్న ఒకటో తేదీ పింఛన్ డబ్బులు సుర్యోదయం కాకముందే ఇచ్చేసేవారు.. పింఛన్ ఎందుకు రాలేదో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇవ్వొద్దని చంద్రబాబు పిటిషన్ పెట్టేసాడని…
పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి.. పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల…
రెండు లక్షల మంది పాడి రైతులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు రూ.80 కోట్లు విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు ముఖ్యమంత్రి ఏ . రేవంత్రెడ్డికి మరో కక్షసాధించారు. గత 45 రోజులుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో పాడి రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి డెయిరీ బిల్లులను క్లియర్ చేసేవారని, అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో క్వింటాన్ డికాక్ (81) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (40*) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడటంతో బెంగళూరు ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచింది.
ప్రచారంలో మమత దూకుడు.. మహిళలతో కలిసి డ్యాన్స్ దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షులైతే.. తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల నుదిటకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. గాయం నుంచి కోలుకోవడంతో ప్రచారంలో స్పీడ్ అందుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో గాలి, వానతో పలు ప్రాంతాలు దెబ్బ…