చిత్తూరు జిల్లా రూరల్ మండలం పచ్చనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారుల ఈత సరదా గ్రామాన్ని శోక సముద్రంలో ముంచింది. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఈత సరదా కోసం సమీపంలోని చెరువుకు వెళ్లారు. అయితే.. చెరువులో బురద ఎక్కువగా ఉండటంతో అందులో చిక్కుకుని ఇద్దరు బాలురు సంజయ్(15), ఆకాష్ (15) మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు.. చెరువు వద్దకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక పోయింది.…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపి బండి సంజయ్ ఢిల్లీలో…
ఏపీలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేసవిలో వడగాలుల సందర్భంగా స్కూళ్లల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది విద్యాశాఖ. ఈ క్రమంలో.. వాటర్ బెల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు డీ-హైడ్రేషనుకు గురి కాకుండా వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలన ఏర్పడేందుకు దొడ్డి కొమురయ్య ఉద్యమ స్పూర్తిని అందిపుచ్చుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన బెంగళూరు.. మొదటగా బౌలింగ్ తీసుకుంది. ఈ క్రమంలో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టులో అల్జరీ జోసెఫ్ స్థానంలో టాప్లీ ఆడుతున్నారు
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ…
మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి.. పేదల భవిష్యత్తు కోస జరిగే యుద్ధంలో పాల్గొనడానికి అందరూ సిద్ధంగా ఉండండని తెలిపారు. ఇంటింటికి మంచి చేశాను.. 175కి 175, 25 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా తగ్గకుండా ప్రజలందరూ గెలిపించాలని సీఎం జగన్ కోరారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చానని పేర్కొ్న్నారు.
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్కు వినతి పత్రం అందించిన తర్వాత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న పంటలు అన్ని ఎండిపోయాయని, పంటలకు ఒక్క తడి నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దానిపై కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు సమయానికి వస్తె కలెక్టర్ సమయానికి రాలేదన్నారు. రైతులకు పంట నష్ట…
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.