కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు మిస్టర్ 360. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (69)…
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్ల కింద సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.