ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠపోరులో రాజస్థాన్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. ఒకానొక సమయంలో మ్యాచ్ పంజాబ్ వైపు ఉన్నప్పటికీ.. హెట్మేయర్ చెలరేగడంతో రాజస్థా్న్ కు విజయం వరించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థా్న్.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
Read Also: KCR : అయితే మోడీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..?
రాజస్థాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (39), తనుష్ కోటియన్ (24) పరుగులతో రాణించారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (18), రియాన్ పరాగ్ (23)రన్స్ చేశారు. ధ్రువ్ జురెల్ (6), హెట్మేయర్ (27), రోమన్ పావెల్ (11) పరుగులు చేశారు. పంజాబ్ బౌలింగ్ లో రబాడా, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలో వికెట్ సాధించారు.
Read Also: Rohit Sharma: బస్సు నడిపిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో అథర్వా థైడే (15), బెయిర్ స్టో (15), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (10), సామ్ కరన్ (6), జితేష్ శర్మ (29), శశాంక్ సింగ్ (9), లివింగ్ స్టోన్ (21), అశుతోష్ శర్మ (31), హర్ ప్రీత్ బ్రార్ (3) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. తక్కువ పరుగులకే కట్టడి చేశారు. రాజస్థాన్ బౌలింగ్ లో అవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, కుల్దీప్ సేన్, చాహల్ తలో వికెట్ తీశారు.