ఢిల్లీలో శనివారం వాతావరణం చల్లబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో కనీసం 22 విమానాలను దారి మళ్లించారు. వాటిలో 9 విమానాలను జైపూర్‌కు, 8 లక్నోకు, 2 చండీగఢ్‌కు, వారణాసి, అమృత్‌సర్ మరియు అహ్మదాబాద్‌లకు ఒక్కో విమానాన్ని మళ్లించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూట్‌లను మార్చిన విమానాలలో 9 ఇండిగో విమానాలు, 8 ఎయిర్ ఇండియా విమానాలు, 3 విస్తారా విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6.30 గంటల మధ్య విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) ప్రతిరోజూ దాదాపు 1,300 విమానాల కదలికలను నిర్వహిస్తోంది.
Chandrababu: మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చినా.. అజెండా ఒక్కటే
ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. కొద్దిసేపు వర్షం కూడా పడింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. సాయంత్రం వర్షం కురిసింది. మరోవైపు.. వాతావరణంలో ఆకస్మిక మార్పు కారణంగా ఉష్ణోగ్రత కూడా పడిపోయింది. ఇదిలాఉంటే.. రేపు (ఆదివారం) వాయువ్య భారతంలో బలమైన గాలులు, వడగళ్ల వాన, మెరుపులతో పాటు ఓ మోస్తరు నుంచి తీవ్ర తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పాటు మీడియం వేగంతో తుపాను వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపింది.
MP Ranjith Reddy: 30 రోజులు నా కోసం కష్టపడితే.. ఐదేండ్లు మీ కోసం నేను కష్టపడతా..