Anushka : పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా, స్టార్ హీరోల అందరి సరసన నటించిన అనుష్క, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ మధ్య ‘ఘాటి’ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ 44 ఏళ్ల నటి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సర్వం సిద్ధమైందని అంటున్నారు. అయితే వరుడు ఇంకెవరో కాదు, అనుష్క కుటుంబానికి బాగా సన్నిహితమైన ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబాలలో ఈ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అంతేకాక, ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Malaika Arora: కొడుకు కన్నా పదేళ్లు పెద్దోడితో బాలీవుడ్ హాట్ భామ డేటింగ్..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్‌డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
అయితే ప్రస్తుతానికి అనుష్క సినిమాలు ఏవీ చేయడం లేదు. చాలా కాలం క్రితమే ఒప్పుకున్న ఒక మలయాళ సినిమా మాత్రమే ఆమె చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు గానీ, లేక ఇతర కార్యక్రమాలలో భాగమవుతున్నట్లుగానీ ఎక్కడా అప్‌డేట్ లేదు. కాబట్టి ఆమె నటనకు పూర్తిగా దూరమవుతుందేమో అనే ప్రచారం అయితే ఉంది. నిజానికి ‘ఘాటి’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమె బాగా లావుగా ఉందని, ఆమెను గ్రాఫిక్స్‌లో సన్నగా చూపించారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే సినిమాల్లో గ్రాఫిక్స్ కూడా అలానే అనిపించాయి. మరి ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదా లేక ఇది కేవలం ప్రచారమా అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేము.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?