“స్కాన్ చేసి స్కామ్ చూడండి”.. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. లోక్సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాట బీజేపీ టార్గెట్గా పోస్టర్ల ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘స్కాన్ చేసి స్కామ్లని చూడండి’ అంటూ పోస్టర్లపై రాసి ఉంది.…
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు.…
గెలుపే లక్ష్యంగా చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేష్ త్వరలోనే రానుంది. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి మరోసారి రంజిత్ రెడ్డి గెలిచేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ రోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం తాండూరు పట్టణంలోని చెన్గెస్ పూర్ రోడ్ సమీపంలో నిర్వహిస్తున్న రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు ఎంపీ డాక్టర్ జి. రంజిత్…
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రేపు(శుక్రవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే టీటీడీ (TTD) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రేపు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. నా ఆస్తులు లెక్క పెట్టడానికి గెలిచినవా, ధర్మపురి ప్రజలకు పని చేయడానికి గెలిచినవా ఎమ్మెల్యేగా అడ్లూరి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకమని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు అయిన అభివృద్ధి పనులను అన్నింటిని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడేలో స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. అటు.. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఐదు మ్యాచ్లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. ఈ…
Alcohol: మద్యం తాగొద్దని మంచి సలహా ఇవ్వడమే పాపమైంది. ఇది నచ్చని ఇద్దరు యువకులు 45 ఏళ్ల వ్యక్తిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన బెంగళూర్లో జరిగింది. నగరంలోని రామచంద్రపురలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో.. ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మిగతా మ్యాచ్ లు ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. జట్టు విజయం కోసం పరితపిస్తుండగా.. ఓ యువ ఆటగాడిని రంగంలోకి దింపుతుంది. విష్ణు వినోద్ స్థానంలో…
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని గీత, సీత పేర్ల గురించి తెలిపారు. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ భారత జట్టులోని సీత-గీత అని అన్నారు. వారిద్దరు ప్రతి పనిని కలిసి చేయడానికి ఇష్టపడతారని కోహ్లీ చెప్పారు. ఈ యువ ఆటగాళ్లిద్దరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వీరి మధ్య ప్రత్యేక సంబంధం, సోదర భావం ఉంటుందని తెలిపారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, డాషింగ్ ఓపెనర్ ఒకరికొకరు చాలా ఇష్టపడతారన్నారు. ఇటీవలి కాలంలో…
రైతులు ఎవరు అధైర్యపడొద్దు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి మార్కెట్ యార్డ్ లోనే PACS ధాన్యం కొనుగోలు సెంటర్ని ప్రారంభించినమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తొందరపడి దళారులకు అమ్ముకొని మోసం మోసపోవద్దన్నారు. తేమ పేరుతో రైతులను దళారులు,అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తేమ శాతం ఉన్నవాటికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని, నాలుగు రోజులుగా వ్యవసాయ మార్కెట్లో కపాల కాస్తున్న రైతులు ఎక్కడ వర్షాలు వస్తాయని భయపడి దళారులకు…