బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్‌కి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. మంకమ్మ తోట నుంచి రాంనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి గంగుల, ఎంపీ అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే హరీష్ రావు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్లో చదువుకున్న విద్యార్ధిని నేను.. జరిగిన అభివృద్ధి చుస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవన్నారు. బీఆర్ఎస్కు…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 168 పరుగుల టార్గెట్ ను ముందుంచింది. లక్నో బ్యాటింగ్ లో అత్యధికంగా ఆయుష్ బదోని (55) పరుగులు చేసి జట్టుకు కీలక రన్స్ చేసి సాధించిపెట్టాడు. 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, 4 ఫోర్లు…
సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొననున్నారు రాజ్‌నాథ్ సింగ్. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్…
తమ పార్టీకి ఎన్నికల సంఘం 'కుండ' గుర్తు కేటాయించినట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతామన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న ఢిల్లీ.. లక్నోపై గెలవాలని చూస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్ లు గెలిచి కేవలం…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు సచివాలయంలో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఉద్దశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి, బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బంది పై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల జీఎస్ గార్డెన్ లో నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1971లో దాయాది దేశం పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బంగ్లాదేశ్ దేశాన్ని విభజన చేయకుండా ఉంటే పాకిస్తాన్ మన పక్కలో బల్లమై ఉంటుండే అని తెలిపారు. పాకిస్తాన్ ను ముక్కలు చేసి బంగ్లాదేశ్ తలెత్తకుండా రక్షణ…
బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుదని తెలిపారు. రాముడు దేవుడు.. కానీ ఆయన్ని ఓ పార్టీకి లీడర్ని చేశారని విమర్శించారు. మెదక్‌లో ఆ పార్టీ పేరే ఎత్తకండి అని అన్నారు. ఎమోషన్లకు పోయి ఆ పార్టీ వ్యక్తిని గిల్ల వద్దని కార్యకర్తలకు జగ్గారెడ్డి సూచించారు. మెదక్ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన గడ్డపై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అని పేర్కొన్నారు.
Iran: సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్ ఫోర్స్‌కి చెందిన టాప్ కమాండర్,