Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Udayagiri Joint Mla Candidate Kakarla Suresh Is Rushing In The Campaign

Kakarla Suresh: ప్రచారంలో దూసుకుపోతున్న కాకర్ల సురేష్.. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం

Published Date :April 13, 2024 , 10:08 pm
By Rajesh Veeramalla
Kakarla Suresh: ప్రచారంలో దూసుకుపోతున్న కాకర్ల సురేష్.. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్లోని బి.ఎన్ రెడ్డి నగర్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వలసవాసులు అపూర్వ స్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య యువత, ఆడపడుచులు బి.ఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకర్ల సురేష్ కు మేమున్నాము మీకు అని ధైర్యాన్ని నింపి మా అందరి ఓటు సైకిల్ గుర్తు మీద మా పవిత్రమైన ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటాము అని ఘంటాపదంగా తెలిపారు. సభా ప్రాంగణం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి.. ఉదయగిరి ముద్దుబిడ్డ కాకర్ల సురేష్.. తెలుగుదేశం జిందాబాద్ అంటూ చప్పట్లతో మారుమోగిపోయింది. కాకర్ల సురేష్ను పూలమాలతో శాలువాతో సత్కరించుకున్నారు. ఆదరించండి.. అండగా ఉంటాను.. నేనేంటో నిరూపించుకుంటానని కాకర్ల తెలిపారు. సమయం దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన వలస వాసులందరూ తమ గ్రామాలకు చేరుకొని తెలుగుదేశం గెలుపుకు కృషి చేయాలి అన్నారు.

గొట్టి గుండాల పాలెం సర్పంచ్ కోవి మాల్యాద్రి ఆధ్వర్యంలో 60 కుటుంబాలు టీడీపీలో చేరిక..
కొండాపురం మండలం గొట్టి గుండాల పాలెం గ్రామ సర్పంచ్ కోవి మాల్యాద్రితో పాటు 60 కుటుంబాలు వైసీపీని వదిలి టీడీపీ పార్టీలో చేరారు. వారందరికీ ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా వింజమూరు మండలం రావిపాడు మాజీ సర్పంచ్ మోత్కూరు హనుమంతరావు, కొండపల్లి సురేష్, దంతులూరి శ్రీనివాసులు, పవన్ కుమార్, మోత్కూరు రామాంజనేయులు, మోత్కూరు హరీష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read

  • Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
  • YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
  • YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

తెలుగుదేశం పార్టీలో చేరిన వారు..
గొట్టిగుండాల పాలెం సర్పంచ్ కోవి మాల్యాద్రి, కోవి కొండల్ రావు, కోవి లక్ష్మి, కోవి మహేష్, కోవి లావణ్య, కోవి మహేశ్వరి, వింజం చెన్నయ్య, వింజం పద్మ, వింజం మురళి, ఓరుగంటి దొరస్వామి నాయుడు, ఓరుగంటి స్రవంతి, ఓరుగంటి బాబు రావ్, ఓరుగంటి లలిత, చల్లా శ్రీనివాసులు, చల్లా మస్తానమ్మ, చల్లా వికెలేష్ నాయుడు, మలాది రాములు, మలాది తులసమ్మ, వింజం రాములు, వింజం శ్రీదేవి, వింజం రామకృష్ణ, మలాది శ్రీనివాసులు, మలాది లావణ్య, బండారు మాల్యాద్రి, బండారు చెన్నమ్మ, వింజం కొండపనాయుడు, వింజం జ్ఞానంబికా, వింజం బాలకృష్ణ, వింజం వెంకట గాంధీ, వింజం భ్రహ్మ నాయుడు, వింజం భవాని, వింజం మహేశ్వరి, మలాది మాలకొండరాయుడు, మలాది భాగ్యమ్మ, మలాది వెంకటేశ్వర్ రావ్, మలాది సరస్వతి, మలాది రమేష్, మలాది కేశవ, మలాది వెంకటరత్నం, మలాది లక్ష్మి, మలాది రవి, మలాది స్వర్ణ, కోవి శుభరాయుడు, కోవి కొండపనాయుడు, కోవి వెంకటరత్నం, కోవి దివ్య, కోవి వెంకటేశ్వర్లు, కోవి శుభరాత్నమ్మ, కోవి హరికృష్ణ, కోవి రాములు, కోవి రమాదేవి, కోవి గోపి కృష్ణ, చల్లా సుబ్బారావు, చల్లా అనసూయ, చల్లా రత్నం, చల్లా శిరీష, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపురం మండల కన్వీనర్ మారెళ్ళపల్లి ఓంకారం, వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, కొండాపురం మాజీ జెడ్పిటిసి సభ్యులు మహేశ్వరరావు, మారెళ్ళపల్లి రామయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనసైనికులు, బిజెపి నాయకులు, తదితరులు ఉన్నారు.

తనయుడు గెలుపు కోసం తల్లి ఇంటింటి ప్రచారం..
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి కాకర్ల మస్తానమ్మ కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ కమ్మవారిపాలెం గ్రామంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెలగపాడుపంచాయతీ కమ్మవారిపాలెం గ్రామంలో ఇంటింటికి తిరిగి మహిళలకు కాకర్ల సురేష్ తల్లి తన తనయుడిని గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ ప్రవేశపెట్టనున్న పథకాలను వివరించారు. తమ తనయుడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మంచి ఆశయంతో వచ్చారని ఆశీర్వదించాలని తెలిపారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో 150 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రాజకీయాలలోకి రాక ముందు నుండి సేవ చేస్తున్నారని ఆయన నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఇద్దరి గుర్తులు సైకిల్ అని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఆ గ్రామ ప్రజలు తనయుడు కోసం చేస్తున్న ప్రచారానికి మద్దతు తెలుపుతూ వారి వెంట నడిచారు. ఏ ఇంటికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పలికారు. తమ ఓటు సైకిల్కేనని ఆనందంగా తెలియజేశారు. ఎర్రటి ఎండలో చేస్తున్న ప్రచారాన్ని చూసిన అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు, ఎందుకమ్మా ఇంత కష్టం మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేము తెలుగుదేశాన్ని ఆదరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ కర్నాటి ప్రభాకర్, తెలుగు యువత మహిళ అధ్యక్షురాలు సుజాత, సీనియర్ నాయకులు గన్నపునేని శ్రీనివాసులు నాయుడు, కర్నాటి శ్రీనివాసులు నాయుడు, కొండప నాయుడు, తెలుగు యువత మేదరమెట్ల రామారావు మరియు తెలుగు యువత, తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.

తమ్ముడు గెలుపు కోసం అన్న వెంకట్ వదిన రుక్మిణి ఇంటింటి ప్రచారం..
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం అన్న కాకర్ల వెంకట్, వదిన కాకర్ల రుక్మిణి, కోడలు కాకర్ల మేఘన ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడు గెలుపు కోసం అన్న, వదిన, కోడలు నిరంతరం శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో పల్లె పల్లెకు తిరుగుతున్నారు. కాకర్ల సురేష్ ను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజా సేవకుడు, అభాగ్యులకు ఆపద్బాంధవుడు, అన్నదాన ప్రభువు, పేదల పాలిటి పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆడపడుచులకు అన్నదమ్ముడు, రైతన్నలకు రైతు బిడ్డగా నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో విశేష సేవలు అందించి తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఎంతో మందిని ఆదుకున్న కాకర్ల సురేష్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి అభ్యర్థిస్తున్నారు.

అందులో భాగంగా.. వరికుంటపాడు మండలం జడదేవి పంచాయతీ పరిధిలోని జడదేవి, కాకోల్లు వారిపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రార్థించారు. సూపర్ సిక్స్ పథకాలు అద్భుతం అని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేసిన నేత నారా చంద్రబాబు నాయుడు అని ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రజా సేవకులు నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరికుంటపాడు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బిజెపి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Elections 2024
  • chandrababu
  • Election Campaign
  • Kakarla Suresh
  • tdp

తాజావార్తలు

  • Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!

  • Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..

  • Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!

  • Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions