జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు ఎంపీగా ఉంది ఇక్కడి ప్రజలకు బీబీ పాటిల్ సేవలు అందించారన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ స్వేచ్ఛ ఇవ్వకపోయినా పని చేసిన వ్యక్తి బీబీ పాటిల్ అని ఆయన అన్నారు. ఇప్పుడు బీజేపీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
వడ్డీ వ్యాపారం ముసుగులో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ తెలిపారు. మల్టీ జోన్ 1 పరిధిలో గత కొద్ది కాలంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారస్తులు ప్రజలకు రుణాల ను అందిస్తూ వారి నుండి అధిక మొత్తంలో వడ్డీలను వసూళ్ల కు చేస్తూ, డబ్బు చెల్లించని వారిని బలవంతంగా ఇల్లు, పొలాలకు సంబందించిన పత్రాలను బలవంతంగా తీసుకుంటున్నట్లుగా మల్టీ జోన్ పరిధిలో పలు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగుల చేసింది. చెన్నై బ్యాటింగ్ లో చివరలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చెన్నై బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (66), శివం…
జాతిని జాగృతం చేసి, దేశాన్ని సమున్నత స్థాయిలో నిలపాలని కాంక్షించిన మహనీయుడు అంబేద్కర్. ఆ సమున్నత స్థాయిలో భారత దేశాన్ని నిలిపేందుకు వీలుగా ఆయన అతున్నత స్థాయిలో మేధోమధనం చేసిన మన రాజ్యాంగం… దేశానికి దశ, దిశను చూపటమే గాకుండా దాదాపు 75 ఏండ్లకు పైబడి మనకు మార్గదర్శనం చేస్తోంది. ఎంతో ముందు చూపుతో, మరెంతో దార్శనికతతో ఆయన రాసిన రాజ్యాంగం పౌరులకు సమాన హక్కులు, అవకాశాలను కల్పిస్తూ నవీన భారతాన్ని ఆవిష్కరిస్తోంది. ఆ రాజ్యాం నిర్మాత…
మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు.…
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 16న మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ సభ నిర్వహించే సభ స్థలిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. వరుసగా రెండు విజయాలను సాధించిన ముంబై.. మరో విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. అటు సీఎస్కే కూడా.. ముంబైతో మ్యాచ్ లో గెలుపును నమోదు చేసేందుకు సిద్ధమైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగినన మ్యాచ్ లో కోల్కతా ఘన విజయం విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 26 బంతుల్లో ఉండగానే ముగించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (89) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38) కూడా చెలరేగాడు.…