నేడు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్. ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి ప్రారంభం. గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సభ. మధ్యాహ్నం 3.30 కి సీఎం జగన్ బహిరంగ సభ. పిప్పర, పెరవలి, సిద్దాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్న సీఎం జగన్.
నేడు బీహార్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. గయా గాంధీ మైదాన్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ. పూర్నియాలో ప్రధాని మోడీ ర్యాలీ, బహిరంగ సభ.
నేడు మిర్యాలగూడలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం. హాజరుకానున్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి.
నేడు సుల్తాన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ. సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ శ్రేణులు.
నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం. ఎన్నికల వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం. బీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్.
నేడు తమిళనాడులో పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం. చెన్నైలో సాయంత్ర పవన్ కల్యాణ్ బహింరగ సభ.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండోరోజు బాలకృష్ణ పర్యటన. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ప్రచారం. కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్న బాలకృష్ణ.
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతాతో రాజస్థాన్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్.
నేడు జనసేన గాజుగ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టు కీలక మార్పు. జనసేనకు గాజుగ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్. తాము దరఖాస్తు చేసుకుంటే ఈసీ జనసేనకు ఇచ్చిందని పిటిషన్. ఇప్పటికే గాజుగ్లాసును ఫ్రీసింబల్ జాబితాలో చేర్చిన ఈసీ.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 23 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,160 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.67,060 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,600 లుగా ఉంది.