సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే…
ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరుపుతున్న సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఇద్దరు షూటర్లలో ఒకరు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్‌ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే స్థానికంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన…
రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరగడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి ‘మేమంత సిద్ధం’ యాత్రను పునఃప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. “సీఎం జగన్‌కు వైద్యులు ఈరోజు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు, అయితే ఆయన బస్సు యాత్రను కొనసాగించడానికి రేపటి నుండి తిరిగి అదే వేగంతో తిరిగి ప్రారంభిస్తారు. ప్రజలు ఆయన తిరిగి రావడానికి ఆసక్తిగా…
ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. అదే సమయంలో, హమాస్ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను సమర్పించింది. ఇందులో ఇజ్రాయెల్ బందీల విడుదలకు షరతులు విధించారు.
నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్నాంధ్ర సాకార యాత్ర. నేడు నందికొట్కూరు, కర్నూలులో బాలకృష్ణ రోడ్ షో, బహిరంగ సభ. నేడు ఐపీఎల్లో బెంగళూరుతో తలపడనున్న హైదరాబాద్. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్. నేడు సీఎం జగన్ బస్సుయాత్ర యధాతథం. ఉదయం 9గంటలకు కేసపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం. గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్,పుట్టగుంట మీదుగా జొన్నపాడు చేరుకోనున్న బస్సు యాత్ర.. నేడు శ్రీకాకుళంలోని రాజాం, పలాసలో…
కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి 'ఒక పెగ్' తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపొందింది. 20 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినప్పటికీ.. వృధా అయిపోయింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ (105*)పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్…