Home
Telugu News
Telugu News News
-
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్… -
Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మనమే..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు. -
KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానాల మధ్య ఉన్న జట్ల మధ్య జరుగుతుండటంతో ఆసక్తికరంగా ఉండనుంది. -
Maruti Suzuki Swift: వచ్చే నెలలో మారుతి న్యూ స్విఫ్ట్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ ఎడిషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనేక కొత్త అప్డేట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో… -
AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..
రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు. -
KS Jawahar: న్యాయం గెలిచింది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహార్ అన్నారు. 1996లో జరిగిన శిరోముండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలన్నారు. లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని విమర్శించారు. -
Chhattisgarh Encounter: కంకేర్‌లో పోలీసులు-నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్.. 18 మంది మావోలు హతం..!
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కంకేర్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. -
AP News: ఎన్నికల వేళ మరో ఉన్నతాధికారి బదిలీ..
ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
BRS: ఈనెల 18న బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం..
సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు. -
Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ కారులో లోపం.. రీకాల్ చేసిన కంపెనీ
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు నిస్సాన్ మాగ్నైట్‌ను నాలుగు మీటర్ల SUV విభాగంలో అందించింది. ఈ SUVలో లోపం ఉన్నట్లు కంపెనీకి సమాచారం అందింది. ఆ తర్వాత కొన్ని యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత, ఆ కంపెనీ తన SUVని రీకాల్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ SUVలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందింది. దీంతో.. కొన్ని యూనిట్లు రీకాల్ చేశారు. అయితే ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై…
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!