చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2024 ఐపీఎల్ లో తన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. ఈ సీజన్ తనకు చివరిదని, తర్వాత సీజన్లు ఆడడంటూ ప్రచారం కొనసాగుతుంది. అందుకోసమే గ్రౌండ్ లో ఫ్యాన్స్ ను ఉత్సహపరిచేందుకే విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడని కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే.. ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్స్ ధోనీ, తర్వాత సీజన్లు ఆడుతాడని జోస్యం చెప్పారు.
Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..
టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఆర్పీ సింగ్ జియో సినిమా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంకర్ వారిని MS ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అని అడిగాడు. దానికి వారు మాట్లాడుతూ.. ధోనికి ఇదే లాస్ట్ సీజన్ కాదు.. ఒకటి లేదా రెండు సీజన్లు ఆడతాడని చెప్పారు. ధోని ఐపీఎల్ భవిష్యత్తు గురించి జియో సినిమాలో చర్చ సందర్భంగా.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇది తన చివరి సీజన్ అని అనిపించడం లేదని చెప్పారు. రైనా ఏది ఆడుతాడంటే ఆడుతాడు అని ఆర్పీ సింగ్ మాట్లాడగా… సురేష్ రైనా మాట్లాడుతూ, ఆడతాడని అన్నారు. దీనిపై ఆర్పీ సింగ్ మళ్లీ బదులిస్తూ.. ఒక సీజన్ గురించి మాట్లాడితే రెండు సీజన్లు పాడైపోతాయని చెప్పారు.
Sundarakanda: ఈ సారి ‘సుందరకాండ’తో నారా రోహిత్
కాగా.. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ.. వరుసగా 3 సిక్సులు కొట్టి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. అతని ఫిట్ నెస్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్.. ధోనీని చూసేందుకు స్టేడియాలకు తరలివెళ్తున్నారు. ఇదే చివరి సీజన్ అంటున్న నేపథ్యంలో ధోనీ అభిమానులు క్యూ కడుతున్నారు. చూడాలి మరీ.. ధోనీ తర్వాతి సీజన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..
Another #TATAIPL season for Thala Dhoni? 🥹#IPLonJioCinema | @ImRaina | @rpsingh | @anantyagi_ pic.twitter.com/eeMUfyryGT
— JioHotstar Reality (@HotstarReality) April 17, 2024