MLA Shakeel : నా కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నా కుమారుడు రాహిల్‌ను కేసుల్లో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. ఎమ్మెల్యే షకీల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడి తప్పు వుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానన్నారు. నా కుమారుడు రాహిల్ చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదన్నారు. దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలన్నారు షకీల్. కేసు ట్రయల్ లో వుందని, నాపై రాజకీయ కక్ష వుంటే నా కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నా కుమారుడు పంజాగుట్ట కేసులో కారు బారికేడ్లకు తగిలితే నా కుమారుడిపై 21 సెక్షన్ల కేసులు పెట్టారని, కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నానని ఆయన అన్నారు.
నా ఆరోగ్యం బాగాలేకపోయినా నాపై ఎఫ్.ఐ.ఆర్ చేశారని, నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేశానని, నా కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. నా కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, నా కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ ఇతర పోలీస్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. నా కుమారుడు రాహిల్ మానసిక ఒత్తిడికి గురి అయితే హాస్పిటల్ లో చికిత్స తీకుంటున్నారని, ఓ విద్యార్థి పై ఇన్ని కేసులు పెడితే ఏలా అని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ఆలోచించండి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
తాజావార్తలు
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!