*తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్లు.. నాలుగో విడతలో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్.. ఈ నెల 25 వరకు నామినేషన్ల దరఖాస్తుకు అవకాశం.. 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్‌డ్రాకు చివరి తేదీ.. ఒక్కో అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం.. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్.. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ.. తెలంగాణలో 17 లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 25 ఏపీ సీఎం జగన్ నామినేషన్.
*రాజమండ్రి: 17వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బస్సు యాత్ర.. ఇవాళ 85 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించినున్న సీఎం జగన్.. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం.. సాయంత్రం రాజమండ్రి సిటీలో సీఎం జగన్ రోడ్ షో.. రాత్రి రాజనగరం నియోజకవర్గం ఎస్టీ. రాజాపురంలో సీఎం జగన్ రాత్రి బస.. సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైసీపీ శ్రేణులు
*నేడు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు.. మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్.. పాల్గొననున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
*నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం.. శ్రీరాముడికి పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ రాధాకృష్ణన్.
*తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం.. నేడు ఆన్‌లైన్‌లో జులై నెలకు సంబంధించి టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల.
*జగిత్యాల జిల్లా : నేడు మధ్యాహ్నం ధర్మపురిలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం.. పాల్గొననున్న మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మెల్యేలు అడ్లూరి, విజయ రమణరావు, మక్కన్ సింగ్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, వినోద్, పార్లమెంట్ అభ్యర్థి వంశీ
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,120.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,940.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.89,900.
*ఐపీఎల్: నేడు పంజాబ్ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్.. చండీగఢ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.