Union Minister Rajnath Singh Helicopter Checked By Election Officials In Telangana: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో శుక్రవారం ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Read Also: Jaggareddy: బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
లోకసభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనడం కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు . ఎన్నికల సిబ్బంది ఫ్లైయింగ్ స్కాడ్ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ , శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠలు తనిఖీ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.