ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించేలా అనేక చర్యలు చేపట్టామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్టలరీలు, బ్రూవరీస్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిఘా పెట్టామని, మద్యం రవాణ జరిపే వాహానాలకు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టామన్నారు ఎంకే మీనా. సేల్ పాయింట్ల వద్ద గతంలో జరిగిన అమ్మకాలకు.. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలను బేరీజు వేస్తున్నామని, 7 లక్షల మంది హోం ఓటింగుకు అర్హులైన వాళ్లున్నారన్నారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద…
ఏపీలో ఎన్నికల్లో జోరు పేరిగింది. నిన్న ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంలో పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌కు సిద్ధం కాగా… తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్ వేయనున్నారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి.. చీపురుపల్లి మూడు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శనివారం అజిత్‌సింగ్ నగర్ సమీపంలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి ఐదుగురు అనుమానితులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే.. సీఎం జగన్‌పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్‌కు విజయవాడ సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎం జగన్‌ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తల…
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా…
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,900 లుగా ఉంది. నేటి నుంచి 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.…
రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని కూడా నేడు అరెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదైంది.
ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు.