నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమేనని.. బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్ లీడర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్‌కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.
గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలను తెచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఆయన అన్నారు. జిందాల్ స్టిల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గండి కోట ప్రాజెక్ట్ ద్వారా 26 టీఎంసీల నీళ్లు నిలువ చేయగలిగాము కాబట్టి, ప్రజల దాహార్తి తీర్చగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. కడప రిమ్స్…