100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, డిసెంబర్ 9 తేదీన 6 గ్యారంటీల్లో 13 హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రైతు బంధు ఆపిన ఘనులు వీళ్ళే అని ఆయన అన్నారు. రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు వచ్చిందని నిరూపిస్తే.. మా ఎంపీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తా అని జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉంది.. 2 లక్షల ఎకరాలు ఎండినందుక ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేయటంతోనే.. తక్కువ ధరకు ధాన్యం అమ్మల్సిన దుస్థితి అని, ఫ్లోరైడ్ పీడిత జిల్లాను ధాన్యాగారం గా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
నాగార్జునసాగర్ డ్యాం మీదకు వెళ్లే ధైర్యం ఉందా అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. టెయిల్ పాండ్ నుంచి నీరు పోతుంటే ఇద్దరు మంత్రులకు సోయి లేదని, ఇరిగేషన్ మంత్రికి.. సెక్రటరీ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా.? అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. పదవుల కోసం నోరు ముసుకున్న నాయకులు కాంగ్రెస్ వాళ్లు. కాంగ్రెస్ వాళ్లను తన్ని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సాగర్ నీళ్లను దోచుకు పోతుంటే మంత్రులు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. సాగర్ డ్యామ్ మీదకు పోయే దమ్ము వీళ్లకు లేదు. రేపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి వీటి అన్నిటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.