మా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ర్యాలీ కి వచ్చిన ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రాజ్యసభ డా.లక్ష్మణ్. ఇవాళ ఆయన బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుటెండను సైతం లెక్క చేయకుండా భువనగిరి కోట పై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధమయ్యారన్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడన్నారు. మోడీ నీ విమర్శించే స్తాయి రేవంత్ రెడ్డి కి లేదని ఆయన వ్యాఖ్యానించారు. సూర్యుని మీద అమ్మితే నీ మొహం పైనే పడుతుంది అనే విషయం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలన్నారు లక్ష్మణ్
అంతేకాకుండా..’మచ్చ లేని నాయకుడు నరేంద్ర మోడీ.. ప్రపంచం గర్వపడే నాయకుడు నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీ కి మోదీని విమర్శించే అవకాశం లేక మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి కి మీ ఓటు హక్కుతో కర్రు కాల్చి వాత పెట్టీ భువనగిరి ఖిల్లా రుచి చూపించాల్సిన అవసరం ఉంది.. మతం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది.. హైదరాబాద్ లో మతోన్మాద రాజకీయాలు చేసే రజాకార్ వారసులు మజ్లిస్ పార్టీ కి కాంగ్రెస్ కొమ్ము కాస్తుంది.. మరి ఇది మతపరమైన రాజకీయం కదా అని కాంగ్రెస్ నీ నేను ప్రశ్నిస్తున్నా.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోది సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ను ప్రవేశపెట్టాడు..
దీనితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చడమే మోది లక్ష్యం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందే అని నరేంద్ర మోదీ చెపుతున్నారు.. కుల వృత్తులు చేసుకునే వారికోసం విశ్వకర్మ యోజన పథకం మోది ప్రవేశపెట్టారు.. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కి మోది అండగా ఉన్నాడు.. భువనగిరి అభివృద్ధి చెందాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోది కి కానుకగా ఇస్తారని ఆశిస్తున్నాను.. భువనగిరి కోట పై కాషాయ జెండా రెపరెపలాడిస్తారని కోరుకుంటున్నాను.’ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.