Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ భారీగా వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను, తమ శరీరంపై ఉన్న బట్టల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు సమాచారం. రహస్య సమాచారం అందుకున్న కస్టమ్స్ శాఖ దాడులు నిర్వహించి రూ.6.46 కోట్ల విలువైన వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
Read Also: AAP: హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర.. ఆప్ తీరుపై నెటిజన్లు ఫైర్
ఎయిర్‌పోర్టులో పట్టుబడిన వ్యక్తులు తమ వెంట 6.815 కిలోల బంగారాన్ని తీసుకువచ్చారని, దీని విలువ రూ.4.44 కోట్లు. వారి నుంచి రూ.2.02 కోట్ల విలువైన వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ప్రకారం, ముంబై నుండి బ్యాంకాక్ వెళ్తున్న భారతీయ పౌరుడిని ఆపి అతని ట్రాలీ బ్యాగ్‌లో ఉంచిన నూడుల్స్ ప్యాకెట్ నుండి వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. దీని తర్వాత కొలంబో నుంచి ముంబై వస్తున్న ఓ విదేశీ జాతీయుడిని బంగారు కడ్డీలతో అరెస్ట్ చేశారు. బంగారాన్ని లోదుస్తుల్లో దాచుకున్నాడు.
దీంతో పాటు దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, దోహా, రియాద్, మస్కట్, బ్యాంకాక్, సింగపూర్ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న మరో 10 మంది భారతీయులను కూడా విమానాశ్రయంలోనే అడ్డుకుని వారి బ్యాగులు, సామాన్ల నుంచి కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.