ISRO: 3డీ-ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటీవ్ మాన్యుఫాక్చరింగ్(ఏఎం) సాంకేతికతను ఉపయోగించి పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. దీనిని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. సాధారణంగా అనేక విడి భాగాలను ఒక చోట అమర్చి.. వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. కానీ ఈ ఇంజిన్‌ను ఒకే భాగంగా తయారు చేశారు. ఈ టెక్నాలజీని వాడడం వల్ల 97 శాతం ముడి పదార్థాలు, ఉత్పత్తి సమయం 60 శాతం తగ్గుతుందని ఇస్రో తెలిపింది. మే 9న 665 సెకన్ల పాటు ఏఎమ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించి ఇస్రో ఈ ప్రధాన మైలురాయిని సాధించిందని అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇస్రో ప్రకటించింది.
Read Also: India-Maldives: భారత్కు తిరిగొచ్చిన మాల్దీవుల్లో నివసిస్తున్న సైనికులు
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
ఇంజిన్ తయారీ భారతీయ పరిశ్రమలో జరిగింది. ఇంజిన్‌ను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ ఇంజిన్‌ను పరీక్షించేందుదుకు నాలుగు విజయవంతమైన డెవలప్‌మెంటల్ హాట్ టెస్ట్‌లు 74 సెకన్ల సంచిత వ్యవధి కోసం నిర్వహించారు. ఇవి ఇంజిన్ పనితీరు పారామితులను ధృవీకరించాయి. ఇంకా, ఇంజిన్ 665 సెకన్ల పూర్తి అర్హత వ్యవధి కోసం విజయవంతంగా పరీక్షించబడింది. అన్ని పనితీరు పారామితులు ఊహించిన విధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఈ పీఎస్4 ఇంజిన్‌ను సాధారణ PSLV ప్రోగ్రామ్‌లో చేర్చాలని యోచిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.
తాజావార్తలు
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?