KCR : ఈ సారి మోడీ వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోతుంటే ధైర్యం ఇచ్చి పంపిన గడ్డ సిద్దిపేట అడ్డ అని ఆయన అన్నారు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి సిద్దిపేట కి వందనమని, ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందు ఉన్నాయన్నారు కేసీఆర్. బీజేపీ అజెండాలో ఏనాడు పేదల అవస్థలు ఉండవు…ఎంతసేపు అది పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ పార్టీ అని, బీజేపీ ప్రభుత్వం వస్తే 15 లక్షలు ఇస్తానన్నారు వచ్చాయా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ సారి మోడీ వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయని, బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తుందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని, మహిళలకు ఉచిత బస్సు పథకం ఫెయిల్ అయిపొయిందన్నారు కేసీఆర్.
అంతేకాకుండా..’కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. డిసెంబర్ 9నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ మాట తప్పాడు. 4 వేల పెన్షన్ వచ్చిందా…? ఇక రాదు కూడా. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా చేయమంటే చేయలేదు. నేనే సీఎం అయిన తర్వాత సిద్దిపేట జిల్లా అయ్యింది. సిద్దిపేటకి రైలు, నీళ్లు తెచుకున్నాం. సిద్దిపేట జిల్లా రద్దుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. సిద్దిపేట జిల్లా ఉండాలా..? వద్దా..? ఈ మూర్ఖపు ప్రభుత్వం, సీఎం అనేక కుట్రలు చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి కి సిద్దిపేట నుంచే మెజార్టీ లక్ష ఓట్లు ఇవ్వాలి. సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఎంతో సేవ చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నామని.. ఆ అభివృద్ధి కొనసాగాలంటే.. మన హక్కులు రావాలంటే.. మన నీళ్లు మనకే ఉండాలంటే.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20 వేల మెజారిటీ ఇచ్చి.. అంటే ఒక లక్ష మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా మెజార్టీతోనే వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిచిపోయారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!