సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలవడానికి సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారని, భవిష్యత్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి బిఫభిప్రాయాలు ఉండవని ఆయన తెలిపారు.…
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది.
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని…
ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని..…
ఏప్రిల్ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన సిటీ నేచర్ ఛాలెంజ్-2024లో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో హైదరాబాద్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ 2023లో ఈ ఈవెంట్లో పాల్గొనడం ప్రారంభించింది. దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్ట దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. 670కి పైగా నగరాలు మరియు పట్టణాలు వార్షిక గ్లోబల్ ఈవెంట్లో పాల్గొనే హైదరాబాద్ హాంకాంగ్ తర్వాత ఆసియాలో రెండవ స్థానంలో ఉంది…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు.
నిజామాబాద్ ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారని, చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేసినందుకు 2019లో వంద మంది నామినేషన్లు వేశారన్నారు. 2019 లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని, ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడంటూ సీఎం రేవంత్…
దక్షిణ కాశ్మీర్‌లోని హతివారా పుల్వామాలోని జీలం నదిలో బుధవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది నీటిలో పడిపోయారు. కాగా.. అందులో ఏడుగురిని రక్షించారు, మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SDRF రెస్క్యూ సిబ్బంది వారి సామగ్రితో తప్పిపోయిన వ్యక్తుల కోసం రంగంలోకి దిగారు. నదిలో ఇసుక తీసేందుకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. పడవలో తొమ్మిది మంది కార్మికులు ఉండగా, వారంతా…